సుమతీ శతకము–బద్దెన – Sumathi Satakam Baddena Bhupaludu

  You can download the audio of Sumati Shatakam (telugu)  here.   సుమతీ శతకము బద్దెన [మార్చు] 001 శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ భావం: మంచి బుధ్ధిగలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను ఔరా అనునట్లుగా నోటినుండి నీళ్ళూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును భోధించు నీతులను చెప్పెదన్. [మార్చు] 002 అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ భావం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును. [మార్చు] 003 అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక […]

Read more

కుమారీ శతకము–Kumari Shatakam

కుమారీ శతకము Wikisource నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ కుమారీ శతకము శ్రీ పక్కి వేంకట నరశింహ కవీంద్ర కుమారీ శతకం 51వ పద్యం నుండి 1. శ్రీ భూ నీళా హైమవ తీ భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స త్సౌభాగ్యము నీ కొసగంగ లో భావించెదరు ధర్మ లోల కుమారీ! < p>ధర్మపరురాలైన ఓ కుమారీ! శ్రీదేవియు, భూదేవియు,నీళాదేవియు,పార్వతీదేవియు,సరస్వతీదేవియు, నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవతనమును, మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరు గాక. 2. చెప్పెడి బుద్ధులలోపల దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్ మెప్పొంది యిహపరంబులన్ దప్పింతయు లేక మెలగ దగును కుమారీ! ఓ కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము. ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపర దోషమిసుమంతైననూ లేకుండా మసలుకొనుము. నీకు శుభములు కలుగును. 3. ఆటల బాటలలోనే మాటయు రాకుండన్ […]

Read more

కుమార శతకము–Kumara Shatakam

కుమార శతకము శ్రీ పక్కి వేంకట నరశింహ కవీంద్ర కుమార శతకం 51వ పద్యం నుండి 1. శ్రీ భామినీ మనొహరు సౌభాగ్య తయా స్వభావు సారసనాభున్ లోఁ భావించెద; నీకున్ వైభవము లొసగుచుండ, వసుధఁ గుమారా < p>ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను. 2. పెద్దలు వద్దని చెప్పిన పద్దుల బోవంగరాదు పరకాంతల నే పొద్దే నెద బరికించుట కుపదేశింపగఁ గూడ దుర్విఁ గుమారా! ఓ కుమారా! పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు. ఇతర స్త్రీలను ఎన్నడునూ మనసులో తలంచుట మంచిది కాదు. ఈ విషయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము. 3. అతి బాల్యములో నైనను బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స ద్గతి మీర మెలగ నేర్పిన నతనికి […]

Read more