గువ్వలచెన్న శతకము–Guvvalachenna Shatakam

గువ్వలచెన్న శతకము శతకము గురించి క. శ్రీ పార్థసారధీ! నేఁ బాపాత్ముఁడ నీదు పాలఁ బడినాఁడ ననుం గాపాడు మనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా! ।। 1 ।। క. నరజన్మ మెత్తినందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద చ్చరణములు మఱవకుండిన గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా! ।। 2 ।। క. ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా! ।। 3 ।। క. సారాసారము లెఱుఁగని బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేల వేము గువ్వలచెన్నా! ।। 4 ।। క. అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్ వడిఁజేసి నంత మాత్రాన కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా! ।। 5 ।। క. ఈవియ్యని పద పద్యము గోవా చదివించు కొనఁగఁ గుంభిని మీఁదన్ […]

Advertisements

కృష్ణ శతకము: Krishna Shatakam

కృష్ణ శతకము Wikisource నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ కృష్ణ శతకం గురించి: ఆంధ్రదేశం లో కృష్ణ శతకం ఎంతో ప్రాచుర్యం పొందింది. దీనిని నరసింహ కవి రచించాడు. < p>శతకం: శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1|| నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడునీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా||2|| నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీదాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా||3|| హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరి నీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా||4|| క్రూరాత్ముడజామీళుఁడు నారాయణ యనుచు నాత్మనందను బిలువన్ ఏ రీతి నేలుకొంటివి యేరీ నీసాటి వేల్పు లెందును […]

నారాయణ శతకము–Narayana Shatakam

నారాయణ శతకము   నమామి నారాయణ పాద పంకజం వదామి నారాయణ నామనిర్మలం భజామి నారాయణ తత్త్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా |శ్లో| ఆలోక్య సర్వ శాస్త్రాణి విచార్యచ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యాయేన్నారాయణం సదా |శ్లో| శ్రీ రమా హృదయేశ్వరా – భక్త జన చిత్త జలరుహ భాస్కరా కారుణ్య రత్నాకరా – నీవె గతి కావవే నారాయణా || [1] పాప కర్మములఁ జేసి – నరక కూపములఁ బడజాల నిఁకను నీపాద భక్తి యొసఁగి – యొక్క దరిఁ జూపవే నారాయణా || [2] దాన ధర్మములఁ జేయ-నేర, నీ దాసులను బొగడ నేర, నా నేరములఁ దలఁపక – దయ చేసి నన్నేలు నారాయణా || [3] ఆన యించుక లేకను – దుర్భాష లాడు నా జిహ్వ యందు, నీ నామ చతురక్షరి – దృఢముగా నిలుప వలె నారాయణా || […]