శ్రీ కాళహస్తీశ్వర శతకము – Sri Kalahastiswara Satakam

|శార్దూలము| శ్రీ విద్యుత్కవితాజవంజన మహా జీమూత పాపాంబుధా రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా ! మీ కరుణా శరత్సమయమింతే చాలు, చిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా ! 1   |శార్దూలము| వాణీవల్లభ దుర్లభంబగు భవద్వారంబు నన్నల్చి, ని ర్వాణశ్రీ చెఱపట్ట చూచిన విచారద్రోహమో, నిత్య క ళ్యాణ క్రీడలబాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో శ్రీ కాళహస్తీశ్వరా ! 2   |శార్దూలము| అంతా మిథ్య తలంచి చూచిన, నరుడట్లౌ టెరింగిన్, సదా కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతిఁ జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళ హస్తీశ్వరా ! 3   |శార్దూలము| నీ నాసం దొడబాటుమాట వినుమా నీచేత జీతంబు నే గానింబట్టక, సంతతంబు మరివేడ్కన్గొల్తు, సంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము న న్నాపాటియే చాలు, […]

Advertisements